కొత్తకారైనా.. సెకెండ్ హ్యాండ్ ది అయినా..కొనేప్పుడు కొన్ని విషయాలను క్షణ్ణంగా పరిశీలించాలి. చాలామంది సెకెండ్ హ్యాండ్ కారు కొనేప్పుడు..చూసేందుకు ఎలా ఉంది అనే దానిపైనా ఎక్కువ ఫోకస్ చేస్తారు. కారు కొనడం అనేది చిన్నవిషయం కాదు. అన్నీ చూసుకుని విక్రయించాలి. అయితే మొదటిసారి కారు కొనుకోలు చేయాలనుకుంటే..మీకు డ్రైవింగ్ కూడా ఎక్కువ అనుభవం లేదంటే..సెకెండ్ హ్యాండ్ కారు కొనడమే మంచిది. దానివల్ల మీకు అనుభవం పెరుగుతుంది..ధైర్యంగా డ్రైవింగ్ చేయగలమనే నమ్మకం వస్తుంది. ఈరోజు సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేప్పుడు చేయకూడడని పొరపాట్లు ఏంటో చూద్దాం.
1. కాగితపు పనిని విస్మరించవద్దు
సెకండ్ హ్యాండ్ కారుని కొనుగోలు చేసేటప్పుడు రాత పనిని విస్మరించడం అతిపెద్ద తప్పులలో ఒకటి. ఈ రాతపని కారు చట్టబద్ధంగా మీదేనని నిర్ధారిస్తుంది. దీనినే RC బదిలీ ప్రక్రియ అని అంటారు. ఇది ఎక్కువ సమయం తీసుకోదు. డీలర్‌షిప్ నిర్వాహకులు నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. సమయానికి పత్రాలను అందజేస్తారు.
2. కారు ఫైనాన్స్ విషయం
ఇది చాలా ముఖ్యం. చాలామంది కారును EMIపద్దతిలోనే కొనుగోలు చేస్తారు. మీరు కొనే కారుకు మొదటి యజమాని డబ్బు మొత్తం కట్టశారా..కారు ఏమైనా లోన్ లో ఉందా అనే విషయం చెక్ చేయాలి. సెకెండ్ హ్యాండ్ కార్లకు కూడా ఫైనాస్స్ ఇస్తారు. ఈ రోజుల్లో ఫైనాన్సింగ్ కంపెనీలు ఉపయోగించిన కార్లకు తక్కువ వడ్డీ రేట్లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. కాబట్టి మీరు కొనే కారుకు ఫైనాన్స్ ఆప్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
3. క్షుణ్ణంగా తనిఖీ
సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయదారు కారుని కొన్ని కారణాల వల్ల విక్రయిస్తాడు. ఆ కారణాలలో ఒకటి కారు పనితీరు సరిగా లేకపోవడం లేదంటే ఇతర సమస్యలు ఉండవచ్చు. అమ్మడానికి కారణం ఏంటో క్లియర్ గా తెలుసుకోవాలి. కారులోని కొన్ని ముఖ్యమైన పార్ట్స్ పరిస్థితి ఎలా ఉందో..ఒక మెకానిక్ సాయంతో తెలుసుకోవచ్చు. కొన్నికార్లలో ఇంజన్ బాగా పాడైపోయి ఉంటుంది. కారు మాత్రం కొత్తదిగా మెరుపులు దిద్దుతారు. కాబట్టి మీరు దాని పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా తెలుసుకోవాలి.
4. లుక్ ద్వారా మోసపోవద్దు
ఇది చాలామంది చేసే పొరపాటు. కారు అవతారం చూసి ఆకర్షిస్తుంటారు. మంచి కారు కళ్లకు చెడుగా కనిపించవచ్చు. చెడ్డ కారు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అందుకే మీరు సెకండ్ హ్యాండ్ కారును దాని రూపాన్ని బట్టి కొనుగోలు చేయకూడదు.
5. టెస్ట్ డ్రైవ్
ఇది కొత్తదైనా..పాతదైనా సరే..దాన్ని ముందు పరిశీలించడం చాలా ముఖ్యం. టెస్ట్ డ్రైవ్ చేయడం ద్వారా కారు పరిస్థితి, పనితీరు గురించి తెలుసుకుంటారు. అలాగే టెస్ట్ డ్రైవ్ చేయడం ద్వారా విక్రేత ఇచ్చిన కారు వివరణ సరైనదా కాదా అని కూడా తెలుసుకుంటారు. ఇది అయితే అందరూ చేస్తారు. కానీ కొందరు అమ్మేవారి మాటలను పూర్తిగా నమ్మేసి టెస్ట్ డ్రైవ్ ను విస్మరిస్తారు.
మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తున్నట్లైతే వీటిని కూడా ఫాలో అవ్వండి. కారు విషయంలోనే కాదు..బైక్స్ విషయంలో కూడా మనం ఈ పాయింట్స్ ను వదలకూడదు. డబ్బు ఒక్కసారి మీ చేతినుంచి వెళ్లిదంటే..తిరిగి తీసుకోవడం చాలా కష్టం.