తెలంగాణ రాజకీయాల్లో గెలుపోటములని ప్రభావితం చేసే శక్తి బీసీలకే ఎకువగానే ఉంది. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు బీసీలే. పక్కాగా బిసి ఓటర్లు చేతుల్లోనే గెలుపోటములు డిసైడ్ అయ్యే నియోజకవర్గాలు సగం పైనే ఉన్నాయని చెప్పవచ్చు. అందుకే ఏ పార్టీ అయిన బిసిల మద్ధతు పొందాలని చూస్తూ ఉంటాయి. బిసిల మెజారిటీ దక్కితే ఇంకా ఆ పార్టీకి తిరుగుండదు. అధికారం దక్కుతుంది.
అయితే బిసి ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ ఒకటి. ఇక్కడ బిసి ఓటర్లే కీలకం. ఇంతకాలం వారే గెలుపోటములని డిసైడ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా వారే కీలకం కానున్నారు. బిసిల్లో కూడా గౌడ వర్గం ఓట్లు కీలకం. గత మూడు ఎన్నికల్లో గౌడ సామాజికవర్గం అభ్యర్ధులే గెలిచారు. 2009 ఎన్నికల్లో కూన శ్రీశైలం గౌడ్ ఇండిపెండెంట్ గా గెలవగా, 2014, 2018 ఎన్నికల్లో కేపి వివేకానందగౌడ గెలిచారు. అందువల్ల.. ఈ నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం ఓట్లే కీలకం.
ఇక గౌడ వర్గంతో పాటు బిసిల్లో ముదిరాజ్‌లు, మున్నూరు కాపుల డామినేషన్ కూడా ఉంది. ఈ మూడు వర్గాలు వన్‌సైడ్ అయితే..గెలుపు కూడా వన్‌సైడ్..ఇప్పటివరకు కేపికే బిసిల మెజారిటీ సపోర్ట్ దక్కింది. ఇప్పటికీ అదే మద్ధతు ఉంది. రానున్న ఎన్నికల్లో ఆయన బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా ఫిక్స్ అయిపోయారు. దీంతో ఆయన నియోజకవర్గంలో దూసుకెళుతున్నారు. కాంగ్రెస్ , బిజేపిల నుంచి క్లారిటీ లేదు.
కాంగ్రెస్ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. కొలన్ హన్మంత్ రెడ్డి, కౌన్సిలర్ జోత్స్న శివారెడ్డి, రేవంత్ ప్రధాన అనుచరుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురు రెడ్డి వర్గం నేతలే. ఇక్కడ రెడ్డి వర్గం ఓట్లు బాగానే ఉన్నాయి. కానీ గెలవాలంటే బిసిల మద్ధతు తప్పనిసరి. అటు బిజేపి నుంచి కూన శ్రీశైలం గౌడ్ బరిలో ఉండే ఛాన్స్ ఉంది. టిడిపి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉంటారని అంటున్నారు. ఈయన ముదిరాజ్ వర్గం.
మొత్తానికి కుత్బుల్లాపూర్ లో గెలుపోటములని డిసైడ్ చేసేది బిసిలే…వారే ఇక్కడ కింగ్స్. వారు ఎటువైపు ఉంటే వారిదే గెలుపు.