ఏ పంట పండించినా.. దానికి సరైన ఎండ, వర్షం కావాలి. అయితే ఇవి కావాల్సిన టైమ్‌లో రాకపోవడం వల్ల.. పంటలు దెబ్బతింటాయి. వ్యవసాయం అనేది కత్తిమీద సాము అని అందుకే అంటారు. మన చేతుల్లో లేదు.. అవసరం లేనప్పుడు అతిగా వర్షం కురిస్తే.. పంట నీటిపాలు అవుతుంది. కావాల్సిన వాన రాకపోతే.. పొలం బీడుబారుతుంది. కానీ ఇప్పుడు చెప్పే వ్యవసాయం చేస్తే.. మీకు ఈ సమస్య ఉండదు. వర్షం, కరువు సమస్య లేకుండా.. ఏడాదికి కేవలం ఎకరానికి రెండు కోట్లు సంపాదించవచ్చు. అసలు వ్యవసాయం మీద లక్షలు రావడమే గొప్ప విషయం.. ఏకంగా కోట్లా అనుకుంటున్నారా…? ఇప్పుడు చెప్పే ఐడియా చూస్తే మీకే తెలుస్తుంది.
ఇజ్రాయెల్ కొత్త సాంకేతికత ద్వారా ఈ వ్యవసాయాన్ని ప్రారంభించింది. దీని పేరు నిలువు వ్యవసాయం. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ రకమైన సాంకేతికతతో వ్యవసాయం ప్రారంభమైంది. మహారాష్ట్రలోని ఓ కంపెనీ ఇదే తరహాలో పని చేస్తోంది. ఇందులో పసుపు సాగు చేస్తున్నారు. ఈ నిలువు వ్యవసాయంలో 1 ఎకరం సాగు చేస్తే, 100 ఎకరాలకు సమానమైన దిగుబడి వస్తుందట. అంటే మీ ఒక ఎకరం స్థలం, 100 ఎకరాలకు సమానం అవుతుంది. ఈ సాంకేతికతలో పంటలను పండించడానికి భూమి అవసరం లేదు.
వర్టికల్ ఫార్మింగ్ ఎలాగో తెలుసుకోండి:
నిలువు వ్యవసాయానికి పెద్ద సెట్‌ను నిర్మించడం అవసరం. దీని ఉష్ణోగ్రత 12 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంచాల్సి ఉంటుంది. ఇందులో 2-3 అడుగుల పొడవు, వెడల్పు గల కంటైనర్లు నిలువుగా ఉంటాయి. వీటికి నీటి కోసం పైప్‌లు ఉంటాయి. చాలా మంది ప్రజలు హైడ్రోపోనిక్ లేదా ఆక్వాపోనిక్ నిలువు వ్యవసాయం చేస్తారు. ఇది భూమిపై చేసే వ్యవసాయం కాదు. కానీ ఇందులో మట్టిని కొద్ది మొత్తంలో ఉపయోగిస్తారు. ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఫాగర్లు ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవసాయంలో ఉపయోగించే పైపులను చాలా కాలంపాటూ మార్చాల్సిన అవసరం ఉండదట.
పసుపును ఎలా పండిస్తున్నారంటే..
నిలువు వ్యవసాయం ద్వారా పసుపును పెంచినట్లయితే 10-10 సెంటీమీటర్ల దూరంలో జిగ్-జాగ్ పద్ధతిలో పసుపు విత్తనాలను విత్తాలి. పసుపు పెరిగేకొద్దీ, దాని ఆకులు అంచు నుంచి బయటికి వస్తాయి. పసుపుకు ఎక్కువ కాంతి అవసరం లేదు. నీడలోనే బాగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల, నిలువు వ్యవసాయంలో పసుపుకి మంచి ఉత్పత్తిని పొందవచ్చు. సాధారణ వ్యవసాయంలో 1 సంవత్సరానికి ఒకసారి మాత్రమే పసుపు పంట వెయ్యగలరు. సీజన్‌ను బట్టి వెయ్యాలి కాబట్టి.. కానీ నిలవు వ్యవసాయంలో సీజన్‌తో పనిలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు. ఈ సాగు పూర్తిగా భవనం లోపల జరుగుతుంది. పురుగులు, వానలు, తుఫానుల వల్ల నష్టపోయే అవకాశం ఉండదు.అయితే ఉష్ణోగ్రత సరిగా ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యవసాయం సాగునీటిని కూడా ఆదా చేస్తుంది. ఫాగర్లు కొంత నీటిని వినియోగిస్తాయి.
మీకు ఈ వ్యవసాయం మీద ఇంట్రస్ట్ ఉంటే.. ఇంకాస్త వివరంగా తెలుసుకుని నిపుణులను సంప్రదించి.. ఎంత ఖర్చు అవుతుందో చూసుకుని స్టెప్ తీసుకోవచ్చు. వ్యవసాయం కూడా మంచి వ్యాపారమే అవుతుంది.