అసెంబ్లీలో అంబటి వర్సెస్ బాలయ్య..భారీ క్లైమాక్స్.!

-

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య గొడవలు ఎప్పుడు తారస్థాయిలోనే జరుగుతున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రజా సమస్యలపై చర్చ అన్నట్లు ఉండేది. వాటి కోసమే అధికార, ప్రతిపక్ష సభ్యులు పోటాపోటిగా మాట్లాడుకునే వారు. ఇప్పుడు అలా కాదు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. అధికార పార్టీ లేదు..ప్రతిపక్ష పార్టీ లేదు. అటు వైసీపీ, ఇటు టి‌డి‌పి ప్రజా సమస్యలని పక్కన పెట్టి సొంత సమస్యలే ఎజెండాగా వెళుతున్నాయి.

ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతున్నారు. దాడులు చేసుకునే పరిస్తితి కూడా ఉంది. అలాంటి పరిస్తితి తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకుంది. ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు, బాలయ్యల మధ్య గొడవ తీవ్ర స్థాయిలో జరిగింది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా స్పీకర్ చైర్ వద్దకు వెళ్ళి టి‌డి‌పి ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో అంబటి మాట్లాడుతూ టి‌డి‌పి ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో బాలయ్య మీసం తిప్పారట. దీంతో అంబటి ఘాటుగా స్పందిస్తూ.. ఇక్కడ కాదు సినిమాల్లో మీసాలు తిప్పాలంటూ అంబటి బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు.

అటు బాలయ్య దమ్ముంటే రా అంటూ సవాల్ చేశారట. ఈ క్రమంలో స్పీకర్ టి‌డి‌పి ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు. అయితే బయటకొచ్చాక బాలయ్య మాట్లాడుతూ.. అంబటి రాంబాబు తనకు మీసం చూపించి, తొడగొట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వృత్తిని అవమానిస్తేనే తాను రియాక్ట్ అయ్యానని, అంబటి వ్యాఖ్యలకు కౌంటర్ గా తాను కూడా మీసం మెలేసి, తొడకొట్టానని తెలిపారు.

తన వృత్తి తనకు తల్లిలాంటిదని, తల్లిని అవమానిస్తే ఊరుకుంటానా? అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే సినిమాల్లో చూపించుకో అని అంబటి అన్నారని… అందుకే తాను ‘చూసుకుందాంరా’ అని సవాల్ విసిరానని చెప్పారు. తిడితే అందరిలాగే పడతానని అంబటి అనుకున్నారని అన్నారు. అటు అంబటి సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు..మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..ఇది తెలుగు గడ్డ అంటూ అంబటి ట్వీట్ చేశారు. మొత్తానికి బాలయ్య, అంబటి మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడిచింది.

Read more RELATED
Recommended to you

Latest news