టిడిపి-జనసేన పొత్తుపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. పొత్తు సక్సెస్ అవుతుందని కొందరు అంటుంటే..కొందరు ఫెయిల్ అవుతుందని చెబుతున్నారు. ఈ పొత్తును గురించి అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఎగతాళిగా మాట్లాడిన వారే. పొత్తు వల్ల తమకు ఎటువంటి నష్టము లేదని, తమకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందని వైసిపి వారు గట్టిగా అంటున్నారు.
కానీ ఇప్పుడు వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలలో తమ ఓటమి తప్పదని గుబులు కనిపిస్తోందని రాజకీయ వర్గాలవారు అంటున్నారు. గత ఎన్నికలలో 40 నుంచి 45 స్థానాలలో వైసిపి చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది. అప్పుడు వైసిపి, టిడిపి, జనసేన మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ముక్కోణపు పోటీలో ఓట్లు చీలడం వల్ల వైసీపీ విజయం సాధించింది అని జనసేన వారు అంటున్నారు. కానీ ఈసారి టిడిపి జనసేన పొత్తు ఉండటంవల్ల వైసిపి విజయం కష్టమే అని రాజకీయ వర్గాల అభిప్రాయం.
మచిలీపట్నం, పెడన, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమిలి, ముమ్మిడివరం, తెనాలి, ఆచంట, అమలాపురం, ఏలూరు, నగరి, నెల్లూరు సిటీ, ప్రత్తిపాడు, రామచంద్రపురం, తణుకు, విజయవాడ సెంట్రల్ ఇలా కొన్ని నియోజకవర్గాలలో చాలా తక్కువ మెజారిటీతో వైసిపి గత ఎన్నికల్లో గెలిచింది. కానీ ఈసారి జనసేన విజయం సాధిస్తుందని రాజకీయ వర్గాలు, సర్వేలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. పొత్తులో ఓట్లు బదిలీ అయితే టిడిపి-జనసేనలకు ప్లస్. లేదంటే వైసీపీకి ప్లస్.