చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సీఐడీ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రమోద్ దూబే వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకానంద కోర్టుకు హాజరయ్యారు.
బెయిల్ పిటిషన్పై వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అయితే ముందు కస్టడీ పొడిగింపుపై దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. చంద్రబాబును మరో ఐదు రోజుల పాటు కస్టడికి అనుమతించాలని కోరింది సీఐడీ. రెండు రోజుల పాటు విచారణ చేపట్టినప్పటికీ విచారణలో కీలక అంశాలు వెల్లడించలేదని.. దీంతో దీంతో మెమో ఫైల్ చేయాలని సీఐడీని న్యాయమూర్తి ఆదేశించారు. మెమో దాఖలుకు సమయం ఇవ్వాలని సీఐడీ కోరింది. దీంతో విచారణను మధ్యాహ్నానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయని పేర్కొంటున్నారు.