తెలంగాణలో వచ్చే ఎన్నికలు మూడు పార్టీలకు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న BRS, అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ మరియు బీజేపీ లకు కటిన పరీక్ష ఈ ఎన్నికలే.. ఈ సంవత్సరం ఆఖరులో లేదా 2024 ప్రదమంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తాజాగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ కాంగ్రెస్ PCC చీఫ్ రేవంత్ రెడ్డి పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. రేవంత్ రెడ్డి ఇటీవల ఓవైసీ కుటుంబాన్ని ఉద్దేశించి మీరు అంతా మహారాష్ట్ర నుండి తెలంగాణకు వలస వచ్చారు అని చేసిన వ్యాఖ్యలపై ఎం ఐ ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. రేవంత్ ను ఉద్దేశించి అక్బరుద్దీన్ మాట్లాడుతూ… పార్టీలు మారడమే అలవాటుగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి మా గురించి కామెంట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మరియు సోనియా గాంధీ లు ఎక్కడి నుండి వచ్చారో ఆలోచించుకుని మా గురించి మాట్లాడండి అంటూ రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్.
ఇక మీదట మా గురించి ఏమైనా కామెంట్ చేస్తే ఖబడ్దార్ అంటూ వాళ్ళ స్టైల్ లో వార్నింగ్ ఇచ్చాడు అక్బరు్దీన్.