కాంగ్రెస్‌కు అధికారమిస్తే కుంభకోణాలు గ్యారంటీ : కేటీఆర్‌

-

కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. గ్యారెంటీ కార్డులంటూ మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు గ్యారెంటీ కార్డులను అమలు చేసేది లేదని చెప్పారు. పదవులు రాని వారు పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు.ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గంగిరెద్దుల వాళ్లలా వస్తుంటారని తెలిపారు. వాళ్ల మాయ మాటలు నమ్మొద్దని సూచించారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

KTR, Kavita join Mahua Moitra in condemning hate speech by BJP MP Ramesh  Bidhuri in Lok Sabha

ఆరు దశబ్దాలు కరెంట్, సాగు నీరు ఇవ్వని కాంగ్రెస్.. ఇపుడొచ్చి ఆరు గ్యారంటీలంటే నమ్ముదామా అని ప్రశ్నించారు కేటీఆర్. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు అడుగుతున్నారని.. వాళ్లకు 11 సార్లు అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని విమర్శించారు. 73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చాం..43 వేల కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి నల్లా ఇచ్చామన్నారు. రైతును రాజును చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కు అధికారమిస్తే కుంభకోణాలు గ్యారంటీ అని విమర్శించారు కేటీఆర్. టికెట్ల కోసం కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్ారని ఆరోపించారు. తానే ఇల్లు కట్టించి..తానే పెళ్లి చేయిస్తానని కేసీఆర్ చెబుతున్నారని.. పేదలకు అండగా కేసీఆర్ ఉన్నారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్నారు. ఎన్టీఆర్ కాలువ ద్వారా మూడు పంటలకు నీళ్లు అందుతాయన్నారు. ఆ పనిచేసేది ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆరేనన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news