రతిక రోజ్‌ రియల్‌ స్టోరీ ఇదే ? ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది తనేనా..?

-

టాలివుడ్‌లో బిగ్‌బాస్‌కు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆ సీజన్‌ ఎంత చెత్తగా ఉన్నా సరే.. వాటికి ఎడిక్ట్‌ అయిపోతారు. ఇప్పటివరకూ 6 సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్‌బాస్‌.. ఇప్పుడు 7వ సీజన్‌ నడుస్తుంది. ఉల్టాపల్టా పేరుతో.. మొత్తం ఆటనే మార్చేశారు మేకర్స్‌.. నిజానికి ఈ సీజన్‌ అంత ఇంట్రస్టింగ్గా లేదు. ముందు అసలు హోస్‌లో ఉన్నవాళ్లు గేమ్‌ ఆడటానికి స్కోప్ లేకుండా పోతుంది. సరే ఈ విషయం పక్కన పెడితే.. హోస్‌లో రతిక చేస్తున్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే.. రతిక ఆట గురించి పక్కనపెడితే.. ఆమె రియల్‌ లైఫ్‌ స్టోరీ, తన బ్యాగ్రౌండ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎందుకో మీకు స్టోరీ చివరకి వచ్చే సరికి అర్థమవుతుంది..!

తెలుగు సినీ హీరోయిన్ ప్రియా అలియాస్ రతిక రోస్ (Rathika Rose). ఎలాంటి సపోర్ట్ లేనప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరిస్తుంది. పరిస్థితులు అనుకూలించడంతో సినీ రంగంలో ఎంతోమంది నటులను పరిచయం చేసిన ప్రముఖ డైరెక్టర్ సూచనల మేరకు ప్రియా కాస్త రతిక రోస్‌గా పేరు మార్చుకుంది.

అయితే రతిక స్వగ్రామం కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలోని వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగాం. గ్రామీణ ప్రాంత రైతుబిడ్డ. అయితే రతిక రోస్ బిగ్ బాస్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి జిల్లా ప్రజల మన్ననలు పొందుతుంది. రతిక తండ్రి రాములు యాదవ్, తల్లి అనితారాణి. తండ్రి వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ క్రియాశీలక రాజకీయాలలో ఉన్నారు. రతికకి ప్రవళిక అనే అక్క ధరణి అనే చెల్లెలు కూడా ఉంది. వీరు ముగ్గురు సంతానం.

నటించిన సినిమాలు..

హీరోయిన్‌గా రతిక మొదటగా పటాస్ ఫ్రీగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించింది. అలాగే కామెడియన్ బిత్తిరి సత్తితో కలిసి తీసిన తుపాకి రాముడు సినిమాలో హీరోయిన్‌చిన తగా నటింర్వాత సినీ ప్రపంచానికి పరిచయమైంది. కార్తికేయ 2, నారప్ప, దృశ్యం 2, ఇలా ఎన్నో సినిమాల్లో నటించి తాజాగా బెల్లంకొండ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సార్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా, హీరో సాయికుమార్‌తో అతిథిదేవోభవ సినిమాలో కూడా నటించింది. శశికళ శంకర్, బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, మరియు తమిళ్లో రెండు సినిమాల్లో కూడా నటించింది. ఇలా ఎన్ని సినిమాల్లో నటించిన ఎన్ని షోలు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో గుర్తింపు అంతగా తెచ్చుకోలేకపోయింది. బిగ్ బాస్ లోకి రావడంతో తెలుగు ప్రజలకు మరింత చేరువ కావచ్చని సంకల్పంతో బిగ్ బాస్ షోలో అడిగిపెట్టినట్టు స్వయంగా హోస్ట్ నాగార్జునతో తన మనసులో మాట చెప్పిన విషయం మనకందరికీ తెలిసినదే.

రతిక రోజ్ తండ్రి రాములు యాదవ్ సినిమా రంగంపై ఎంతో ఇష్టంతో తెలుగు నటుడు కావాలని చాలా ప్రయత్నాలు చేశాడట. కానీ అవేవి సాధ్యం కాలేదు.. దీంతో తాను నటుడు కాకపోయినా తన కూతురు నటన కల నెరవేర్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు రాములు యాదవ్. జిల్లా వాసుల నుంచి రతికకు మంచి సపోర్ట్‌ ఉంది.

అయితే ఈరోజు రతికనే ఎలిమేనట్‌ కానున్నట్లు బిగ్‌బాస్‌ వర్గాల నుంచి సమాచారం. సరిగ్గా ఆడకపోవడం, అబ్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవటం, అనవసరంగా విషయాన్ని సాగదీయడం, లవ్‌ ట్రాక్‌ ఇలా ఎన్నో కారణాల వల్ల రతిక ఎలిమేనేట్‌ అయినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news