తెలంగాణ అప్పు తీర్చి అభివృద్ధి చేసే సత్తా నాకే ఉంది : కేఏ పాల్‌

-

ఈ వారంలో సికింద్రాబాద్ నుంచి పాదయాత్ర చేస్తున్నానని, దమ్ముంటే ఆపుకోండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సవాల్ విసిరారు. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ వారు మందు పంచి, వందలు వేలు ఖర్చు చేస్తే వారికి జనం వస్తారని, కానీ ప్రజాశాంతి పార్టికి ఆవేమి అవసరం లేదన్నారు.

KA Paul: My friend should replace Modi as PM

ప్రజల హృదయాల్లో కేఏపాల్ ఉన్నారని, కుటుంబ, అవినీతి పాలన పోవాలంటే పాల్ రావాలి.. పాలన మారాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదని మండిపడ్డారు. ప్రజలు రెడ్డి సీఎంగా రేవంత్ రెడ్డి కావాలా..? బీసీ ముఖ్యమంత్రిగా తాను కావాలా..? అవినీతి కేసీఆర్ పాలన కావాలా తేల్చుకోవాలన్నారు. ఈ వారంలో పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కూడా తనతో పాదయాత్ర చేయాలని ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ అప్పు తీర్చి అభివృద్ధి చేసే సత్తా తనకు మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాకుండా.. 90 శాతం ఉన్న బడుగుబాలహీన వర్గాల పార్టీని గెలిపించుకుందాం అంటూ ఈ సందర్భంగా పాల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బానిసలుగా ఉంటున్న ప్రజలు కళ్లు తెరవాలని సూచించారు. కేసీఆర్ కి ఓట్లు వేస్తే కాంగ్రెస్ కి వేసినట్టే,, కాంగ్రెస్ కి ఓట్లు వేస్తే కేసీఆర్ కు వేసినట్లేనని అన్నారు.వీళ్లంతా నా ఆశీస్సులు తీసుకున్నవారే అంటూ కేఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news