మంత్రి కేటీఆర్ నేడు ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి శంకుస్థాపనలు,
ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. ధర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజంగా ధర్మరాజే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది.. మీ ఓటులోనూ ధర్మం ఉండాలి. 50 వేల ఓట్ల మెజార్టీతో ఈశ్వరన్నను గెలిపించాలి. అప్పుడే ధర్మం ఉన్నట్లు లెక్క.. లేకపోతే నిజంగా ధర్మం లేనట్టే అని కేటీఆర్ పేర్కొన్నారు.
చెరువు నిండిన తర్వాత కప్పలు చాలా వస్తాయని, అలాగే పార్టీ బాగున్నప్పుడు కూడా చాలామంది నేతలు వస్తూనే ఉంటారని, అయితే కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్లు ఎవరో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కొప్పుల మాత్రం పార్టీ వెంటే నడిచారన్నారు. తాను ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారనని పదిహేనేళ్ల క్రితమే చెప్పారని గుర్తు చేశారు. అన్నట్లుగానే ఆయన నిత్యం తమతోనే ఉన్నారన్నారు. ను కొప్పుల ఈశ్వర్‌కు ఫ్యాన్ అయిపోయాను అని కేటీఆర్ గుర్తు చేశారు. ఎప్పుడు అయ్యాను అంటే.. నాకు బాగా గుర్తున్న సందర్భం చెబుతున్నా. 2009 ఎన్నికలప్పుడు మనం అనుకున్న ఫలితాలు రాలేదు. 46 సీట్లలో పోటీ చేస్తే కేవలం 10 స్థానాల్లో గెలిచాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది.. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు.