ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏమీ ఒరగదు : కేటీఆర్

-

రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద అత్యాధునికంగా నిర్మించిన విజయ మెగా డెయిరీని ఇవాళ తెలంగాణ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలకు బదులిచ్చారు. కేవలం ఊకదంపుడు ప్రసంగాలు, నోటి మాటలతో రైతుల ఆదాయం రెట్టింపు కాదని చురకలు అంటించారు.

KTR Speech Jagtial Tour Today : 'జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేసే  బాధ్యత నాది', ktr-speech-jagtial-tour-today-ktr -fires-on-congress-in-jagtial-ktr-promise-to-jagtial-mango-farmers

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 2014లో ఒక మాట చెప్పారు.. అదేంటంటే 2022 నాటికి రైతుల ఆదాయం డ‌బుల్ చేస్తాన‌న్నాడని కేటీఆర్ గుర్తు చేశారు. రైతుల ఆదాయం డ‌బుల్ అయిందా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో త‌ప్ప‌ ఇతర రాష్ట్రాల్లో రైతుల క‌ష్టాలు డ‌బుల్ అయ్యాయి. ఇత‌ర రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా, 24 గంట‌ల క‌రెంట్ ఇవ్వ‌లేని దుస్థితి నెల‌కొని ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. మోదీ చెప్పిన‌ట్టు రైతుల ఆదాయం డ‌బుల్ అయినా, కాక‌పోయినా.. తెలంగాణ‌లో మాత్రం కేసీఆర్ నాయ‌క‌త్వంలో పాడి రైతుల‌కు గానీ, ఇత‌ర రైతులంద‌రికీ న్యాయం జ‌రుగుతుంది. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ త‌ప్ప‌కుండా ప‌రిపుష్టం అవుతోంది. త‌ప్ప‌కుండా గ్రామాల్లో సంప‌ద పెరుగుతుంది. ఆ పెరిగిన సంప‌దతో తెలంగాణ స‌స్య‌శ్యామ‌లంగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news