అశ్వరావుపేట పాలిటిక్స్..మెచ్చాకు మద్ధతు ఉందా?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం..విభిన్న ప్రజా తీర్పు వచ్చే నియోజకవర్గం. ఒకో ఎన్నికకు ఒకో తీర్పు ఇస్తూ ఉంటారు. దీంతో ఈ సారి ఎలాంటి తీర్పు ఇస్తారని ఆసక్తి నెలకొంది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలవగా, 2014లో వైఎస్సార్సీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. కానీ తెలంగాణలో వైసీపీ కనుమరుగు కావడంతో తాటి..బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు.

2018 ఎన్నికల్లో తాటి బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు..కానీ అక్కడ టి‌డి‌పి నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక తెలంగాణలో టి‌డి‌పి కూడా దెబ్బతినడంతో మెచ్చా బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. ఇప్పటికే కే‌సి‌ఆర్..ఆయన్ని అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో మెచ్చా ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే ఎప్పటికప్పుడు తీర్పు మార్చే అశ్వరావుపేట ప్రజలు..ఈ సారి కూడా తీర్పు మారుస్తారని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఆ పార్టీ వాళ్ళు ధీమాగా ఉన్నారు.

కాకపోతే కాంగ్రెస్ లో సీటు కోసం పోటీ ఎక్కువ ఉంది. మొన్నటివరకు బి‌ఆర్‌ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ లోకి వచ్చి..సీటు రేసులో ఉన్నారు. అటు మరో మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన వారసురాలు పూజిత, పొంగులేటి అనుచరుడు జారె ఆదినారాయణ సీటు రేసులో ఉన్నారు.

అయితే తాటి కూడా పొంగులేటి సన్నిహితుడే. కాకపోతే పొంగులేటి కంటే ముందే తాటి కాంగ్రెస్ లోకి వచ్చారు. అటు తాటి, ఇటు జారెల మధ్య పోటీ ఎక్కువ ఉంది. సీటు తమదంటే తమదని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఎవరికి సీటు దక్కిన..ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తేనే అశ్వరావుపేటలో విజయం దక్కుతుంది. లేదంటే మెచ్చాకే ప్రజా మద్ధతు వస్తుంది. చూడాలి మారి ఈ సారి అశ్వరావుపేట ప్రజలు ఎటువైపు ఉంటారో.

Read more RELATED
Recommended to you

Latest news