శరీరం అంతా తగ్గుతుంది కానీ, పొట్ట మాత్రం తగ్గడం లేదు. ఎందుకు?

-

మనిషి లావుగా ఉన్నారా.. సన్నగా ఉన్నారా.. అని వారి పొట్టను చూసి చెప్పవచ్చు. శరీరం అంతా సన్నగా ఉండి. పొట్టమాత్రం లావుగా కనిపిస్తుంటే వారు లావుగా ఉన్నారనే చెబుతారు. అందుకు ఎన్నో వర్కౌట్స్ చేస్తుంటారు. కానీ ఫలితం ఉండదు. ఎన్ని పనులు చేసినా బొజ్జ రావడానికి కారణం మనం రోజూ చేసే కొన్ని పనులే. ఆ పనులేంటో చూసి తెలుసుకుందాం.

ఎందుకు తగ్గడంలేదు!
జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేవారు కొందరు. వారు ట్రైనర్ సలహాలతో వర్కౌట్స్ చేస్తుంటారు. శరీరంలోని భాగాలకు తగినట్లుగా ఎక్సర్‌సైజ్‌లు చేపిస్తుంటారు. మరికొంతమంది ఎవరి సలహా లేకుండా ఇంట్లోనే కసరత్తులు చేస్తుంటారు. దీంతో సరైన అవగాహన ఉండదు. పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వుమాత్రం అలానే ఉంటుంది. ఈ కొవ్వు రకరకాల అనారోగ్యాలకు కారణమవుతుంది.

ప్రభావం : శరీరంలోని అన్ని భాగాలకు కొవ్వు ఉంటుంది. అయితే ఎక్కువగా పిరుదులు, తొడలు, పొట్టపై ఉంటుంది. కానీ వీటన్నింటికంటే పొత్తికడుపుపై కొవ్వు శరీరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఎంత ప్రయత్నించినా పొట్టచుట్లూ పేరుకుపోయన కొవ్వు కరుగకపోవడానికి కారణాలేంటో చూద్దాం.

తగినంత నిద్రలేకపోవడం : నిద్రలేమి కారణంగా జుట్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు. పొత్తికడుపుపై కొవ్వు పెరగే ప్రమాదముంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటే రోజుకు 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. గ్రెలిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆకలిని పేరేపించే హార్మోన్.

గర్భాశయంలో తిత్తులు ఉండకపోవచ్చు : గర్భాశయంలో తిత్తులు కలిగించే టెస్టోస్టెరాన్ మొత్తాన్ని పెంచడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. దీన్ని తగ్గించడం కష్టతరం. మీరు ఉన్నట్టుండి హఠాత్తుగా బరువు పెరిగినట్లయితే వెంటనే వైద్యుడిని కలిసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

అధిక ఒత్తిడి కారణం కావచ్చు : డిప్రెషన్ కారణంగా కూడా కొవ్వు పెరుగుతుంది. ఆఫీసులో పనిచేసేవారు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యల వల్ల సతమతమవుతున్నవారికి ఇతర ఒత్తిళ్ల వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ కణజాలం వల్ల పొట్ట వద్ద కేంద్ర కొవ్వు ఏర్పడుతుంది. ఇలా అవ్వడానికి ఈ ఒత్తిడి హార్మోన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

అధికంగా ఉప్పుతినడం వల్ల : చాలామంది రోజూ తినాల్సిన ఉప్పు కంటే అధికంగా ఆహారంలో తీసుకుంటారు. దీంతో వారికి రుచిగా అనిపించవచ్చు. కానీ బ్లడ్‌ప్రెజర్ పెరుగుతుంది. ఉప్పులోని సోడియం కారణంగా రక్తప్రసరణ సరిగా జరుగక జీర్ణాశయం సరిగా పనిచేయకుండా ఆ ప్రదేశంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

సరైన వ్యాయామం లేకపోవడం : ప్రతిఒక్కరూ చేసే పెద్ద తప్పేంటంటే ప్రతిరోజూ ఒకే రకమైన వ్యాయామం చేస్తుంటారు. అలాకాకుండా వారానికో, నెలకో వ్యాయామంలో మార్పులు చేస్తూ ఉంటే గుండెకి సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. నడక, జాగింగ్, ఈత లాంటివి మొదలుపెట్టాలి. ఇవి శరీర బరువును తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news