పోలీసులు లేకుండా YCP వాళ్లను రమ్మనండి: లోకేశ్

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మరోసారి వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఒక్క సారి పోలీసులు లేకుండా రమ్మనండి అంటూ లోకేశ్ సవాల్ విసిరారు. ప్రజలే వాళ్లను తన్నేలా ఉన్నారని, కొన్ని చోట్ల దాదాపు తన్నారని అన్నారు. ప్రజల తరఫున పోరాడినందుకు, వాళ్ల స్వరం వినిపిస్తున్నందుకు టీడీపీ నాయకులపై, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా ప్రభుత్వం కేసులు పెడుతూ, నోటీసులు జారీ చేస్తున్నారని లోకేశ్ చెప్పుకొచ్చారు.

First 3000 Cr, Then 370 Cr, Now 27 Cr, Later 0 Rs' - Nara Lokesh

గత 28 రోజులుగా జ్యూడిషియల్ రిమాండ్ చంద్రబాబు ఉన్నారు. ఇసుక, మద్యం, మట్టి, మాఫియాలపై నిలదీసినందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు లోకేష్‌.. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును 28 రోజులు రిమాండులో ఉంచారు.. బ్రాహ్మణి, భువనేశ్వరి హెరిటేజ్ లో కష్టపడి సంపాదిస్తుంటే మేం పార్టీ కోసం ఖర్చు చేస్తున్నాం అన్నారు. ప్రతి ఎకరం కష్టపడి కొనుక్కున్నదే. చంద్రబాబు నాయుడు ఏనాడూ అవినీతి, తప్పులు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులు అడుగడుగునా మా తెలుగుదేశం నాయకులను అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా .. లేకపోయినా ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. ప్రజల తరఫున పోరాడమని మా చంద్రబాబు చెప్పారు. శాంతియుతంగా పోరాటాలు చేయాలని సూచించారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news