ప్రతి నెలా రెండు వేలు వచ్చే కరెంట్‌ బిల్లును సున్నా చేసిన మహిళ.. ఐడియా అదిరిందిగా..!!

-

ఇప్పుడు విద్యుత్‌ ఛార్జీలు ఘోరంగా పెరిగిపోయాయి. మొన్నటి వరకూ రెండు వందలు కరెంట్ బిల్లు వచ్చిన వాళ్లకు కూడా వెయ్యి రూపాయల వరకూ బిల్‌ వస్తుంది. ప్రతిపక్షాలు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని నిరసనలు చేస్తున్నాయి. సామాన్య మధ్యతరగతి వాళ్లు ఇంతింత బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్ మండలం కృష్ణ నగర్ గ్రామానికి చెందిన జ్యోతి కూడా అంతంత వస్తున్న విద్యుత్‌ బిల్లును కట్టలేక ప్రత్యామ్నాయం ఆలోచించింది. దెబ్బకు రెండు వేలు కరెంట్‌ బిల్లును సున్నాకు చేసింది. ఎలా అనుకుంటున్నారా..?

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్ మండలం కృష్ణ నగర్ గ్రామానికి చెందిన జ్యోతి, సుబ్బరావు దంపతులు. వీరిది వ్యవసాయ కుటుంబం. ప్రతి నెల 2 వేల రూపాయల వరకు కరెంట్ బిల్లు వస్తుంది. దీంతో కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనుకుంది. స్త్రీనిధి ద్వారా రుణం ఇచ్చి 60 శాతం సబ్సిడీ ఇస్తున్నారని తెలుసుకున్నారు. స్త్రీనిధి అధికారులను కలిసి 3 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. స్త్రీనిధి నుంచి 1లక్ష 25 వేలు, 60 వేల సబ్సిడి, మరో పది వేల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించారు.

వారికి ప్రతి నెల రెండు వేల వరకు వచ్చే కరెంట్ బిల్లు ఈ రోజు జీరోకు పడిపోయింది. ప్రతి రోజు 12 నుంచి 18 యూనిట్ల విద్యుత్ తయారు అవుతుంది. దీంతో మిగులు విద్యుత్‌ను ట్రాన్స్ కోకు అమ్మడం జరుగుతుందని జ్యోతి ఆనందంగా చెబుతోంది. ప్రతి నెల స్త్రీనిధి డబ్బులు 2800ల చొప్పున 60 నెలలు చెల్లిస్తే సరిపోతుంది. 20 ఏళ్ల పాటు సౌరవిద్యుత్ అందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ పెట్టుకొని కరెంటు భారాన్ని తగ్గించుకోవాలని ఆమె సూచిస్తుంది.

జ్యోతిని చూసి గ్రామస్తులు అందరు సోలార్ విద్యుత్ పెట్టించుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం కృష్ణ నగర్ గ్రామాన్ని పైలేట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. స్త్రీనిధి నుంచి సోలార్ విద్యుత్‌కు రుణాలు ఇస్తున్నామని స్త్రీనిధి రిజినల్ మ్యానేజర్ రామ్ దాస్ చెబుతున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు వర్తిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news