రాణించిన అప్గాన్ కెప్టెన్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

-

వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-ఆప్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అప్గాన్ జట్టు మంచి స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రెహ్మనుల్లా గుర్బాజ్ (21),  ఇబ్రహీం జాద్రాన్ (22), రహమత్ షా (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80 : 88 బంతుల్లో 8 పోర్లు, 1 సిక్స్ ), ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (62: 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్ లు ) కీలక ఇన్నింగ్స్ ఆి జట్టును ఆదుకున్నారు.

వీరిద్దరూ నాలుగో వికెట్ కి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహ్మద్ నబీ 19, రషీద్ ఖాన్ 16, ముజీబుర్ రెహ్మన్ 10 నాటౌట్, నవీనుల్ హక్ 9 నాటౌట్ గా ఉన్నారు. భారత బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా 4, హార్దిక్ పాండ్య 2, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో భారత జట్టు లక్ష్యం 273 పరుగులు చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news