గిరిజనులకు న్యాయం చేసేది రాబోయే కాంగ్రెస్ సర్కారే : రేవంత్ రెడ్డి

-

గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని.. గిరిజనులకు న్యాయం చేసేది రాబోయే కాంగ్రెస్ సర్కారే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా రామంజపురంలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అమరుల బలిదానాలతో తెలంగాణ కల సాకారం అయ్యిందన్నారు. తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ చేసిందేమి లేదని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అమరులు, నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేశారని నిప్పులు చెరిగారు.

Revanth Reddy's 'Yatra' in Telangana from January 26, 2023

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఇంటింటికీ వెళ్లి గ్యారెంటీ కార్డు ఇచ్చి, దానిపై నాయకులు సంతకాలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆ గ్యారెంటీలన్నీ అమలులో పెడతామంటున్నారు. కేవలం హామీలు ఇచ్చి వదిలేయబోమని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామని గ్యారెంటీగా చెబుతున్నారు నేతలు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఓ దివ్యాంగురాలికి ఏడో గ్యారెంటీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు.

ఆమె పేరు రజిని, దివ్యాంగురాలు. నాంపల్లికి చెందిన రజిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తి చేసినా కూడా ఆమెకి ఇంకా ఉద్యోగం రాలేదు. ప్రభుత్వ పోస్ట్ లకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కనీసం ప్రైవేటు ఉద్యోగం కూడా ఆమెకు దొరకలేదు. దివ్యాంగురాలు కావడంతో ప్రైవేటు రంగంలో కూడా కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లి తిరస్కరణకు గురయ్యానని చెబుతోంది రజిని. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డిని కలసి తనకు ఉద్యోగం కావాలంటూ అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను మన్నించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఆమెకే ఇస్తామని హామీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news