రాజగోపాల్ రెడ్డితో మాజీ ఎంపీ వివేక్ భేటీ.. పార్టీవీడటంపై క్లారిటీ వచ్చే అవకాశం

-

తెలంగాణలో ఎన్నికలు హీట్‌ పెంచుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీల నేతలు అసంతృప్తితో టికెట్లు రాక వేరే పార్టీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. తమ పార్టీ నుంచి ఇదివరకు బీజేపీలో చేరిన పలువురు కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడో రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. మాజీ ఎంపీ వివేక్ కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి, వివేక్‌తో పాటు మరో కీలక మహిళా నేతను కూడా కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట.

Shock For BJP Komatireddy Rajgopal Reddy to join Congress after Dasara

ఈ రోజు సాయంత్రం రాజగోపాల్ రెడ్డి, వివేక్ సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై చర్చించనున్నారు. వారం రోజుల వ్యక్తిగత పర్యటన ముగించుకున్న వివేక్ ఈ రోజు హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. సాయంత్రం రాజగోపాల్ రెడ్డితో భేటీ కానున్నారు. వీరిద్దరు సమావేశమై బీజేపీలో ఉండాలా? కాంగ్రెస్‌లో చేరాలా? అనే అంశంపై చర్చించనున్నారు. వీరిద్దరి భేటీ తర్వాత నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీలో చేరితే వీరిద్దరికి సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. బీజేపీ విడుదల చేసిన 52 మందితో కూడిన మొదటి జాబితాలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ పేర్లు లేవు. దీంతో వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news