తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. తెలంగాణలో గత కొన్ని రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు తీవ్రమైన ఎండ, ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక రాత్రయితే చాలు ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెల్లవారుజామున చలి మరింతగా పెరుగుతోంది. సోమవారం రాత్రి… హనుమకొండలో 16 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది.
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తర దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నట్లు వాతావరణాధికారులు వెల్లడిస్తున్నారు. హైదరాబాదులో సాధారణం కన్నా…1.7 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. రాజేంద్రనగర్, పఠాన్ చెరువులలోను ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మంలలోను ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక మంగళవారం పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదయ్యాయి.