తాను బీఆర్ఎస్ చేరుతున్నట్లు నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు నాగంను కలిసి BRSలో చేరాలని కోరగా.. ఆయన అంగీకరించారు. ‘నాగర్ కర్నూల్ భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో చేరుతున్నా. కాంగ్రెస్ అధ్వాన్న స్థితిలోకి వెళ్లింది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ను తుంగలోకి తొక్కింది. డబ్బులు ఉన్నవారికి టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితో కలిసి పనిచేస్తా’ అని నాగం వెల్లడించారు.
అయితే.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు ఆదివారం (అక్టోబర్ 29) సాయంత్రం గచ్చిబౌలిలోని నాగం జనార్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సంప్రదింపులు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘నాగం పుట్టుకతో తెలంగాణ వాది’ అన్నారు. నాగం, కేసీఆర్ మధ్య నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెప్పారు. పార్టీలో ఆయనకు సముచిత గౌరవం కల్పిస్తామని ప్రకటించారు.