తెలంగాణలోని ప్రతి వ్యక్తికి కేసీఆర్‌ బీమా సౌకర్యం కల్పించబోతున్నాం : కేటీఆర్‌

-

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో పార్టీ శ్రేణులతో జరిగిన సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని కార్యకర్తలు, నేతలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన తర్వాత కామారెడ్డిలో ఘననీయంగా అభివృద్ధి జరుగుతుందని, అప్పుడు ఇక్కడి భూముల ధరలు అమాంతం 20 నుంచి 30 రెట్లు పెరుగుతాయని అన్నారు. కాబట్టి నియోజకవర్గంలో ఏ ఒక్కరూ గుంట భూమి ఉన్నా అమ్ముకోవద్దని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

KTR questions LS Speaker over derogatory remarks against CM KCR in  Parliament-Telangana Today

‘గంప గోవర్ధనన్న హయాంలో కామారెడ్డి జిల్లా కేంద్రం అయ్యింది. పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగనయ్‌. మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసుకున్నం. ఈ నెల 9న కామారెడ్డిలో జరిగే కేసీఆర్‌ బహిరంగసభకు ప్రతి వార్డు నుంచి 1000 మందికి తగ్గకుండా ప్రజలు వచ్చి జయప్రదం చేసేలా మీరు కృషి చేయాలి. సీఎం మీటింగ్‌ను జయప్రదం చేయాలని పట్టణంలోని ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని కోరాలి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలను వారికి గుర్తుచేసి ఓట్లడగాలి. స్వాతిముత్యంలో కమలాహాసన్‌ ఉద్యోగం కోసం సోమయాజులు వెంటపడ్డట్టు.. మీరంతా ఓట్ల కోసం ప్రజల వెంట పడాలి’ అని మంత్రి సూచించారు.

‘మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణలోని ప్రతి వ్యక్తికి కేసీఆర్‌ బీమా సౌకర్యం కల్పించబోతున్నాం. పద్దెనిమిదేళ్లు పైబడిన అర్హురాలైన ప్రతి ఆడబిడ్డకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3000 భృతి చెల్లించనున్నాం. ఇవన్నీ మ్యానిఫెస్టోలో చేర్చాం. గతంలో మ్యానిఫెస్టోలో చేర్చని పనులు కూడా చేశాం. ఇప్పుడు మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తాం. ఎమ్మెల్యే గోవర్ధన్‌ అన్నతో కలిసి మీరంతా నియోజకవర్గంలోని వివిధ సంఘాలను కలుపుకుని పోవాలి. అందరి మద్దతు కూడగట్టి కేసీఆర్‌ను బంపర్‌ మెజారిటీతో గెలిపించాలి. కామారెడ్డిలో కేసీఆర్‌ గెలుపు ఖాయం. కానీ బంపర్‌ మెజారిటీతో గెలిచిపించడం ముఖ్యం’ అని మంత్రి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news