పెండింగ్‌లో ముగ్గురి బీ-ఫాంలు.. మరో అయిదారు చోట్ల అభ్యర్థుల మార్పుపై కాంగ్రెస్​లో చర్చ

-

కాంగ్రెస్‌ పార్టీ రెండు విడతల్లో ప్రకటించిన జాబితాలో మూడు నియోజక వర్గాల్లోని అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో ముగ్గురికి బీ-ఫాంలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టాలని రాష్ట్ర నేతలకు హైకమాండ్ సూచించినట్లు సమాచారం. రెండో జాబితా ప్రకటించిన తర్వాత పలు నియోజకవర్గాల్లో నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు కీలక నేతలు ఏకంగా పార్టీ మారారు. ఇంకొన్ని చోట్ల పార్టీ ప్రకటించిన అభ్యర్థి కంటే తమకే బలం ఎక్కువగా ఉందని, తమకే టికెట్‌ ఇవ్వాలని కొంతమంది నేతలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో.. అయిదారు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు గురించి పార్టీ నాయకత్వంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఈ పెండింగ్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి జనరల్‌, మిగిలిన రెండింటిలో ఒకటి ఎస్సీ, ఇంకొకటి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఉంది. ఇప్పటివరకు 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ మరో 19 స్థానాలపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది. నేషన్ల ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు గడిచినా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడం, వాటిలో కీలక నియోజకవర్గాలు ఉండటంతో ప్రచారంలో వెనకబడిపోతామని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news