కాంగ్రెస్ పార్టీ చిల్లర మాటలకు లొంగిపోతే ఆగమైపోతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ప్రజలు ఒక్కసారి ఆలోచించారని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ టెక్ సెల్‌వింగ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ తో నమ్మి పొత్తు పెట్టుకున్నము. ఆ రోజుల్లో బలిదేవత సోనియా అమ్మ..అని రేవంత్ రెడ్డి అన్నాడు, నేను అనడం లేదు. ఒక్క బేకుఆఫ్ గాడు అంటాడు. వాడు వీడు, కాంగ్రెస్ వాడు మేము తెలంగాణ ఇచ్చినాము అని అంటున్నారు.
రేవంత్ రెడ్డి గాడు, హౌల గాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడు తుండు. ఈ ఎన్నికలు మా కోసం కాదు, తెలంగాణ ఆగం కావద్దు, ఇక్కడ పోరాటం నిలబడ్డ వ్యక్తి తో కాదు, కాంగ్రెస్ తో మాత్రమే పోటి.. ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ కాదు. ఒక్క కేసీఆర్ ఎంత ఉంటాడు. గింతంత ఉంటాడు, ఆయనను కొట్టడానికి ఎక్కడెక్కడో నుండి వస్తున్నారు. సింహం సింగిల్ గానే వస్తుంది, పందులు గుంపు గుంపు లుగా వస్తాయి. గిట్ల అన్నందుకు ఏమైనా కేసు పెడితే బోయిన పల్లి వినోద్ కుమార్ పై పెట్టండి. డికే శివ కుమార్ గాడు మన నెత్తి మీద పాలు పోసి పోయాడు, వాడు నాశనం చేసి పోయాడు, ఇక పిలవడం లేదు. బేకర్ గాల్లు మనకు అవసరమా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.