ఈ రోజు తెలంగాణ పర్యటనకు విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు బీజేపీ కి ఓటేయాలని ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎల్బీ స్టేడియం లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ అధికార BRS మరియు కాంగ్రెస్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ అధికార పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ…కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజల సొమ్మును దోచుకుందని ఆరోపించారు. వీరు చేస్తున్న అవినీతి ఏ విధంగా ఉందంటే… ఢిల్లీ కి సైతం లిక్కర్ స్కామ్ రూపేనా పాకిందంటూ మోదీ ప్రజలకు తెలియచేశారు. ఎక్కడ ఏ విధంగా అవినీతి చేసినా వారిని జైలుకు పంపడం ఖచ్చితమని మోదీ క్లారిటీ గా చెప్పారు.
దేశంలో ప్రజల సొమ్మును తిన్న ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదంటూ మోదీ ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణాలో అధికార పార్టీ తిన్న మొత్తాన్ని తిరిగి తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్పారు.