వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతోంది. ఈ వరల్డ్ కప్ లో ఎవరూ ఆడని విధంగా ఇండియాను 8 మ్యాచ్ లలో సక్సెస్ గా నడిపించిన రోహిత్ శర్మ టైటిల్ ను అందుకోవడానికి రెండడుగుల దూరంలో నిలిపాడు. అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్ ఆడడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇక తాజాగా ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. రోహిత్ చిన్న నాటి కోచ్ దినేష్ లాడ్ మాట్లాడుతూ ఈ టోర్నీ లో ఇండియా అద్బుతంగా ఆడుతొంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకా దినేష్ లాడ్ మాట్లాడుతూ… ఇండియా ఖచ్చితంగా వరల్డ్ కప్ ను గెలుచుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ చేతుల మీదుగా టైటిల్ అందుకుంటే చూడాలని ఉందన్నారు.
మొదటి సెమీఫైనల్ లో కివీస్ ను ధీ కొట్ట నున్న ఇండియా గెలిస్తే ఫైనల్ కు చేరుకుంటుంది.. ఫైనల్ లో ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికా లను ఎదుర్కోవలసి వస్తుంది. మరి రోహిత్ శర్మ కోచ్ కోరిక తీరుతుందా చూడాలి.