ఉద్యోగ రిజర్వేషన్ లపై హై కోర్ట్ సంచలన తీర్పు …!

-

మాములుగా ఎంతో చదివి తీరా అర్హతను తగిన ఉద్యోగాలు రాకపోతే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే చాలా ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో రిజర్వేషన్ లను కల్పిస్తూ ఉంటారు. అదే విధంగా తాజాగా పంజాబ్ హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వ స్థానికులకు 75 శాతం ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటుందని ఒక చట్టాన్ని తెచ్చింది. అయితే తమ రాష్ట్ర ప్రజల మంచి కోసం తెచ్చి చట్టమే అయినా పంజాబ్ హర్యానా హై కోర్ట్ ఈ చట్టాన్ని కొట్టివేసింది. వివరంగా తెలియచేస్తూ, ఉద్యోగం చేయడానికి మీరు ఫలానా రాష్ట్రానికి చెందిన వారు అయి ఉండాలి అని చెప్పడం కరెక్ట్ కాదంటూ కోర్ట్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది పూర్తిగా వివక్ష కిందకు వస్తుంది అంటూ కోర్ట్ చెప్పడం గమనార్హం.

కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం పంజాబ్ హర్యానా రాష్ట్రాల ప్రజలు ఉద్యోగాల కోసం వలసలు వెళుతుంటే చూడలేక, ఏదో విధంగా అరికట్టలన్నా ఉద్దేశ్యంతో 2020 లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news