ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్షన్ పోలింగ్ డే కు వరుణ గండం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది.
బంగాళాఖాతంలో వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దింతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అటు దక్షిణ తెలంగాణకు అధిక వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ తో పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.