నన్ను చంపేందుకు జీవన్ రెడ్డి కుట్ర.. ఆర్మూర్ ఎమ్మెల్యే రాఖేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాఖేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. క్యారీ తవ్వకాలపై సీబీఐ విచారన కోరినందుకే బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. తనను చంపుతామని రోజు వందల బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు.

ఇక్కడి నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాఖేష్ రెడ్డి చెప్పారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆర్మూర్ స్థానం నుంచి పోటీ చేసి.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని చిత్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి నిండా 10 రోజులు కాకముందే ఎమ్మెల్యే రాఖేష్ రెడ్డి తన హత్యకు కుట్ర జరుగుతుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఆర్మూర్ లో అందరూ ఈ వ్యాఖ్యల గురించే చర్చించుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news