మహాలక్ష్మి స్కీమ్ పై నజర్.. జీరో టికెట్‌పై తనిఖీలకు రంగంలోకి ఆర్టీసీ బృందాలు

-

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మునుపెన్నడూ లేని విధంగా మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇదంతా నాణేకి ఒకవైపు. మరోవైపున బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారని ఉన్నతాధికారుల వద్ద చూపించడానికి కొంత మంది కండక్టర్లు అదనపు జీరో టికెట్లు ఇస్తున్నారు. ఈ విషయం కాస్త అధికారుల వద్దకు వెళ్లడంతో ఆర్టీసీ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో జీరో టికెట్ల తనిఖీ షురూ చేసింది. అయినా కొంతమంది కండక్టర్లలో మార్పు రావడం లేదు.

ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల ప్రయాణాలపై డిపో మేనేజర్లు నజర్‌ పెట్టారు. ప్రభుత్వం నుంచి రాయితీ మొత్తాన్ని భారీగా పొందాలని ఇష్టానుసారం జీరో టికెట్లు జారీచేసి ప్రయాణికులు పెరిగినట్టు కొంత మంది కండక్టర్లు చూపిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన తనిఖీ బృందాలు ప్రయాణికులు లేకుండా జీరో టికెట్‌ జారీ చేసినా.. ప్రయాణించే దూరం కంటే ఎక్కువ దూరానికి టికెట్‌ ఇచ్చినా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news