పార్టీ క్యాడర్ ని పట్టించుకోని టిడిపి నేత.. సొంత వ్యాపారంలో బిజీ బిజీ

-

కార్పొరేటర్ స్థాయి కలిగిన నేతను చంద్రబాబు ఆ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ప్రకటించారు.. అప్పటినుంచి ఆయన పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో పడ్డారు.. కార్యకర్తలను కూడా పట్టించుకోకపోవడంతో పార్టీ క్యాడర్ చిన్నాభిన్నమైంది.. ఇంతకీ ఏంటా నియోజకవర్గము.. ఆ వివరాలు చూద్దాం..

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి దయనీయంగా మారింది.. ఇక్కడి నుంచి గెలిచిన మద్దాల గిరి సీఎం జగన్ కి మద్దతు ప్రకటించడంతో.. ఆయన స్థానంలో కొత్తవారిని తీసుకురావాలని భావించిన లోకేష్.. కార్పొరేటర్ స్థాయి కలిగిన కోవెలముడి రవీంద్రను ఇంచార్జిగా ప్రకటించారు.. అప్పట్నుంచి రవీంద్ర పార్టీలో ఉండే సీనియర్లను, కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారట.. పార్టీ కార్యక్రమాలు కూడా తూతూ మంత్రంగా నిర్వహిస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో పడ్డారని పార్టీ నేతలు చెబుతున్నారు..

చిన్న బాబుకు భారీ స్థాయిలో ముడుపులు చెల్లించుకుని రవీంద్ర ఇంచార్జ్ పదవి తెచ్చుకున్నారని.. ఆయనకు టికెట్ ఇస్తే నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోతామని పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేస్తుంది.. Mla మద్దాలి గిరి వైసీపీకి జై కొట్టిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందట.. ఇంచార్జ్ పదవని అడ్డం పెట్టుకుని రవీంద్ర తన వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారని.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడమే మానేశారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది.. ఆయన పనితీరు ఏంటో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనే అధిష్టానానికి అర్థమైందట.

26 డివిజన్ లు ఉంటే కేవలం 6 డివిజన్ల లో మాత్రమే టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోగలిగారని.. చంద్రబాబు పిలిచి అక్షింతలేసినా ఆయన పనితీరు మారడం లేదట.. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని.. తనకు అందరూ సహకరించాలని రవీంద్ర పార్టీ నేతలని కోరుతున్నారట.. అయితే ఆయన చేసిన విజ్ఞప్తిని పార్టీ క్యాడర్ పట్టించుకోవడంలేదని నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది.. కార్పొరేటర్ స్థాయి కలిగిన వ్యక్తికి ఇంచార్జి పదం ఇవ్వడంతోనే పార్టీ ఇక్కడ కనుమరుగైందని పాత తరం టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news