దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో ప్రతివాదులుగా పోలీసులు

-

తెలంగాణలో జరిగిన దిశ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసు నిందితుల ఎన్కౌంటర్ కూడా పెను దుమారం రేపింది. అయితే దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో దాఖలైన పలు పిటిషన్లలో ప్రతివాదులుగా అనుమతిస్తూ పోలీసు అధికారులకు హైకోర్టు అనుమతించింది. ఈ కేసు పారదర్శక విచారణలో భాగంగా పోలీసులు వాదన వినిపించడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. తుది విచారణలో పోలీసుల వాదన వింటామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

దిశ కేసులో నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవుల ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని, పోలీసులపై ఐపీసీ 302 కింద హత్యా నేరం నమోదు చేయాలంటూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఇతర పిటిషన్లలో తమను ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ పోలీసు అధికారులు హైకోర్టులో మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news