తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తుంది.. సిట్టింగులకి ఈసారి టికెట్లు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కొత్తవారు సైతం టిక్కెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారట.. లోక్సభ సీట్ల కేంద్రంగా తెలంగాణ బిజెపిలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి..
లోక్సభ ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలను బిజెపి సిద్ధం చేసుకుంటుంది.. డబల్ డిజిట్ లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పని చేస్తున్నారు.. ఈ క్రమంలో గెలుపు గుర్రాల వేటలో బిజెపి సీరియస్ గా అడుగులు వేస్తోందట. మోడీ చరిష్మా తో పాటు రామమందిర నిర్మాణం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. తమకు టికెట్ ఇస్తే గెలుస్తామంటూ కొందరు ఆశావాహులు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పెరగడం కూడా తమ పార్టీకి ప్లస్ అవుతుందని నేతలు భావిస్తున్నారట..
సిట్టింగ్ స్థానాలతో పాటు రిజర్వ్ డ్ స్థానాలకు కూడా పోటీ తీవ్రంగా ఉందని.. కొత్తవారు సైతం తమకు అవకాశం కల్పించాలని లాబింగ్ లు ముమ్మరంగా చేస్తున్నారని కమలం పార్టీ నుంచి టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బిజెపికి నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి.. అందులో సికింద్రాబాద్ మినహా మిగిలిన మూడు స్థానాలకు చాలామంది ఆశావాహులు కర్చీఫ్ వేస్తున్నారట. నిజామాబాద్ సిట్టింగ్ స్థానాన్ని మార్చి.. తమకు ఇవ్వాలంటూ కొందరు నేతలు అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.. ఎంపీ అరవింద్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసిందట. ఆ స్థానం నుంచి యండల లక్ష్మీనారాయణ, అల్జపూర్ శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు సీనియర్స్ కూడా ట్రయిల్స్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. కరీంనగర్ సీటు కోసం ఓ మీడియా సంస్థ అధినేత సైతం ప్రయత్నాలు చేస్తున్నారట. బండి సంజయ్ వ్యతిరేకవర్గం సైతం కోరుతున్నారు. ఆదిలాబాద్ లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది.. సిట్టింగ్ ఎంపీ కి టికెట్ ఇవ్వద్దని.. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు కూడా అధిష్టానానికి చెబుతున్నారట. దీంతో తెలంగాణ బిజెపిలో సీటు పోటీ రసవత్తంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..