బుద్ధా వెంకన్నకు చంద్రబాబు బిగ్‌ షాక్‌..ఈ సారి నో టికెట్‌ ?

-

బుద్ధా వెంకన్నకు చంద్రబాబు బిగ్‌ షాక్‌ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే.. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీలో తాను ఏం పని చేశానో వివరిస్తూ రూపొందించిన వీడియోను ప్రదర్శిస్తున్నారు బుద్ధా అనుచరులు. బెజవాడ పశ్చిమ సీటు కోసం పట్టుబడుతున్నారు బుద్ధా వెంకన్న.

Buddha Venkanna

కానీ ఇప్పటికే ఈ సీటు జనసేనకు కేటాయించినట్లు సమాచారం నేపథ్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు బుద్దా వెంకన్న. దీంతో ఈ సారి బుద్ధా వెంకన్నకు టీడీపీ టికెట్‌ రాదని తెలుస్తోంది. ఇక దీనిపై బుద్ధా వెంకన్న మాట్లాడుతూ…చంద్రబాబు చదివిన మొదటి లిస్ట్ లో నా పేరు లేకపోవటం బాధ కలిగిందని…ఇపుడు చంద్రబాబు టికెట్ ఇచ్చిన వారు తర్వాత ఉంటారో లేదు కానీ నేను మాత్రం చంద్రబాబుతో ఉంటానన్నారు. చంద్రబాబు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ప్రేమ తగ్గదని తేల్చి చెప్పారు బుద్ధా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news