చేతకాకపోతే మీరు తప్పుకోండి.. నీళ్లు ఇచ్చి చూపిస్తాం : కేటీఆర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై సీరియస్ కామెంట్స్ చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో భాగంగా పాల్గొన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఎన్ఏ తప్పుడు నివేధిక ఇచ్చిందని.. వారిది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత నివేదిక అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

అదేవిధంగా రోజుకు 5 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని.. ముందు లీకేజీని అరికట్టి, రైతులకు పంట నీరు అందించే ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో లీకేజీలు, చిన్నపాటి పగుళ్లు సామాన్యం.. ఏదైనా పొరపాటు జరిగితే ప్రభుత్వం దానిని సరి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి.. కానీ రాజకీయంగా వాడుకోవాలని చూడకూడదని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి.. వెంటనే రైతులకు పంట నీటిని విడుదల చేయాలని.. అలా చేయడం చేతకాకపోతే మీరు తప్పుకోండి.. మేము నీళ్ళిచ్చి చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news