నా వెంట్రుక కూడా పీకలేరు : కేటీఆర్

-

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ పై బురద జల్లుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. మాపై కోపంతోనే బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం లేదన్నారు. అలాగే.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్న కేకే మహేందర్ రెడ్డి దాకా అందరూ సన్నాసులు, చేతకాని వెధవలు అంటూ తీవ్ర స్థాయిలో కేటీఆర్ మండిపడ్డారు.

కేసీఆర్, తనపై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తోందని కేటీఆర్ ని విమర్శించారు. కాళేశ్వరానికి చిన్న బుంగ పడింది. దానిని మంచిగా చేయవచ్చు. కానీ వర్షాకాలం వరకు నానబెట్టి.. కొట్టుకుపోవాలని చూస్తున్నారు. కేసీఆర్ ని బద్నాం చేయాలని కాంగ్రెస్ చిల్లర రాజకీయం చేస్తోంది. ఇలా అన్నందుకు కేసు పెట్టుకుంటే పెట్టుకోండి. మీరు నా వెంట్రుక కూడా పీకలేరు. దేనికీ భయపడేది లేదు అని కేటీఆర్ సిరిసిల్లలో స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news