కేసీఆర్‌ను టార్గెట్ చేసిన జాతీయ మీడియా…!

-

ఇప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన ఘటన… షాద్ నగర్ లో జరిగిన దిశా అత్యాచారం, దారుణ హత్య వ్యవహారం. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి, రోడ్లపైకి వచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఇది ఒక సంచలనంగా మారింది. పార్లమెంట్ స్థాయిలో దీనిపై పెద్ద చర్చే జరిగింది. ప్రతీ ఒక్కరు కూడా నిందితులను కఠినంగా శిక్షించాలని పార్లమెంట్ వేదికగా నినదించారు. అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం దీనిపై మాట్లాడలేదు.

ఆయన నుంచి ఏ స్పందన లేదు… దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ వెళ్ళినా కేసీఆర్‌ మాత్రం ఎందుకు మాట కూడా మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదే జాతీయ మీడియా పట్టుకుంది. బిజెపికి అనుకూలంగా ఉండే రిపబ్లిక్ చానెల్‌ కేసీఆర్‌ వ్యవహారంపైనే గత రెండు రోజుల నుంచి ఫోకస్ చేసింది. అర్నబ్ గోస్వామి పదే పదే దీనిపై చర్చలు పెడుతున్నారు. ఇటీవల తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డితో ఫోన్ లైన్లో, లైవ్ లో మాట్లాడిన అర్నాబ్… మహ్మద్ అలీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆవేశంగా ఊగిపోయారు.

ఇక సోమవారం కూడా ఆయన దీనిపై చర్చలు పెట్టి కేసీఆర్‌ తీరుని తప్పుబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని, ఆయన ఎందుకు బాధితులను పరామర్శించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు ఇదే చర్చనీయంశంగా మారింది. అర్నాబ్ బిజెపికి అనుకూలంగా పని చేస్తారు అనే ముద్ర ఉంది… ఇక చర్లపల్లి జైలు వద్ద కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి… ఈ ఘటనను బిజెపి ఏమైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు అర్నబ్ పదే పదే కెసిఆర్ ని టార్గెట్ ఎందుకు చేస్తున్నారనే కీలక ప్రశ్న వినపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news