దుమ్ము రేపిన కోహ్లీ… తొలి టి20 టీం ఇండియాదే…!

-

హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టి 20 లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లి భారీ అర్ధ సెంచరితో (94)రాణించడంతో ఘన విజయం సాధించింది. టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ రెండు పరుగులకే అవుట్ అయినా… ఆ తర్వాత వచ్చిన బ్రాండన్ కింగ్ తో కలిసి మరో ఓపెనర్ ఎవిన్ లివిన్స్ ఇన్నింగ్స్ ని నిర్మించాడు. ఇద్దరు కలిసి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో లేవిస్ 17 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి అవుట్ కాగా కింగ్ 23 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత నాలుగో స్థానంలో వచ్చిన హిట్మేయర్ 4 సిక్సులు 2 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ పోలార్డ్ 37 (19 బంతుల్లో4 సిక్సులు, ఫోర్) , హోల్డర్ 24 పరుగులు (9 బంతుల్లో 2 సిక్సుల, 1 ఫోర్) దూకుడుగా ఆడి ఆఖర్లో మెరుపు మెరిపించడంతో విండీస్ 20 ఓవర్లలో 207 పరుగుల స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో చాహల్ 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా… దీపక్ చాహర్ 4 ఓవర్లు వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు. జడేజా, సుందర్, భువి చెరో వికెట్ తీసారు.

భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీం ఇండియా… మూడో ఓవర్ రెండో బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. 10 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేసిన రోహిత్ పెర్రి బౌలింగ్ లో హేట్మేయర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అ తర్వాత మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ తో కలిసి… మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక విండీస్ బౌలర్ల పై ఎదురు దాడికి దిగిన రాహుల్… ఫోర్లు సిక్సులతో విరుచుకుపడ్డాడు. చెత్త బంతులను బౌండరికి తరలిస్తూ… 37 బంతుల్లో అర్ధ సెంచరి పూర్తి చేసుకున్నాడు.

ఇద్దరూ కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. తొలుత పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన ఈ జోడి తర్వాత స్వేచ్చగా షాట్లు ఆడింది. ఈ క్రమంలో భారీ షాట్ కి ప్రయత్నించిన రాహుల్ పెర్రి బౌలింగ్ లో పోలార్డ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 40 బంతుల్లో 4 సిక్సులు 5 ఫోర్ల సాయంతో 62 పరుగలు చేసాడు. ఇక కెప్టెన్ కోహ్లీ 35 బంతుల్లో అర్ధ సెంచరి పూర్తి చేసుకున్నాడు. ఇక అర్ధ సెంచరి పూర్తి చేసుకున్న తర్వాత కోహ్లి దూకుడు పెంచాడు. రాహుల్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పంత్ వచ్చి రావడంతోనే సిక్స్ తో పరుగుల ఖాతా తెరిచాడు.

ఈ క్రమంలో 9 బంతుల్లో రెండు సిక్సుల సాయంతో 18 పరుగులు చేసిన పంత్… కాట్రెల్ బౌలింగ్ లో అనవసర షాట్ కి ప్రయత్నించి హోల్డర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పంత్ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శివం దుబేతో కలిసి కోహ్లి పని పూర్తి చేసాడు. 50 బంతుల్లో 6 సిక్సులు ఆరు ఫోర్ల సాయం 94 పరుగులు చేసాడు. కెప్టెన్ కోహ్లికి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. విండీస్ బౌలర్లలో పెర్రి రెండు వికెట్లు తీయగా కాట్రెల్ ఒక వికెట్ తీసాడు.

Read more RELATED
Recommended to you

Latest news