ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రారంభించారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అధికార పక్షం సమాయత్తమైంది. ప్రతిపక్ష టీడీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంపై దృష్టి సారించింది. ఇక క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం నెలకొంది. పీపీఏల విషయంపై ఇరు వర్గాల మధ్య మాటల దాడిరాజుకుంది. దీంతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చినా టీడీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. ఇతర సభ్యుల మాట్లాడుతుంటే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి దయచేసి నా సీటు మార్చండి అంటూ… స్పీకర్‌కు విన్నవించారు. ప్రతిపక్ష నాయకులు తమ వద్దకు వచ్చి మాట్లాడుతుంటే.. నేనేం మాట్లాడుతానని ఆనం ఆరోపించారు. పక్కసీటులో ఉన్న ఆయన తన దగ్గర వస్తుంటే.. నేనింకా ఏమేం మాట్లాడుతానని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కన్నా తాను చాలా జూనియర్ అన్నారు ఆనం.