టీ-కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ సస్పెండ్..!

-

పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీ ‘లైన్ దాటి మాట్లాడుతోన్న నేతలపై టీ- కాంగ్రెస్ చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న సీనియర్ నేత బక్క జడ్సన్ ను పార్టీ నుండి ఆరు ఏండ్లు సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీ-కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో బక్క జడ్సన్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా మొన్నటి వరకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని పేర్కొన్నారు జడ్సన్.

 

సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై పలుమార్లు బక్క జడ్సన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ డిసిప్లేనరీ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. షోకాజ్ నోటీసులకు బక్క జడ్సన్ ‘రిప్లై ఇచ్చినప్పటికీ.. ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కమిటీ.. తాజాగా బక్క జడ్సన్ ను ఆరేండ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news