రాహుల్ బాబా సమ్మర్ వస్తే.. విదేశాలు చెక్కేస్తాడు : అమిత్ షా

-

సమ్మర్ వచ్చిందంటే చాలు.. రాహుల్ విదేశాలకు వెళ్తారని ఎద్దేవా చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కర్ణాటకలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. అప్పుడే ఇండియా కూటమిపై, రాహుల్ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా.. దేశం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. రాహుల్ బాబా మాత్రం వేసవి వచ్చిందంటే విదేశాలకు చెక్కేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఆరు నెలలకొకసారి కాంగ్రెస్ నేతలే అతడి కోసం వెతుకుతారని ఆరోపించారు. మోడీకి, రాహుల్ కి మధ్య పోలికే లేదని అన్నారు. దేశం మొత్తం మోడీకే మద్దతుగా నిలుస్తుందన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పొంతనే లేదని అన్నారు. ఇండియా కూటమి అవినీతితో, బంధుప్రీతితో మునిగిపోయిందని విమర్శలు చేశారు. 23 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మోడీపై ఒక్క అవినీతి ఆరోపణ చేయలేకపోయారని అన్నారు. ఇక, అహంకార కూటమి అయిన ఇండియా కూటమి.. అవినీతితో మునిగిపోయిందన్నారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ హయాంలోని పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రూ.12లక్షలకోట్ల స్కాంలు జరిగాయని ఆరోపించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అవినీతిపై అమిత్ షా మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు అవినీతిని ఇష్టపడరని.. ఈసారి కాషాయపార్టీనే గెలిపిస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news