వైసీపీకి అనుకూలంగా మ‌రో స‌ర్వే…. ఫ్యాన్ పార్టీదే ఎన్నిక‌ల్లో హ‌వా

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేప‌థ్యంలో ప్రజా నాడి ఎలా ఉందనేది తెలుసుకునేందుకు ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దేశంలో అత్యంత విశ్వసనీయమైన సర్వేలు, ఒపీనియన్ పోల్స్ అందించే టైమ్స్ నౌ మరోసారి ప్రజానాడి గుట్టు విప్పేందుకు ప్రయత్నించింది. ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 లేదా 20 ఎంపీ సీట్ల‌ను గెలుచుకోనుంద‌ని టైమ్స్ నౌ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఎన్‌డిఎ కూట‌మి ప‌ట్ల ప్ర‌జ‌లు సానుకూలంగా లేర‌ని స్ప‌ష్టం చేసింది.ఈ స‌ర్వే ప్ర‌స్తుతం ఏపీలో సంచ‌ల‌నంగా మారింది.

YSRCP Announces Candidates for 25 Lok Sabha Seats in Andhra Pradesh -  TheDailyGuardian

ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రోసారి తాజా రాజకీయ పరిణామాలపై టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన సర్వే నివేదికను బ‌య‌టికి విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సర్వే రిపోర్ట్.. వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..? అనే అంశం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది టైమ్స్ నౌ. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఈ ఒపీనియన్ పోల్స్‌ను నిర్వహించింది. సామాజిక వర్గాల, వయస్సు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వయోధిక వృద్ధులు.. ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుంచి ఒపీనియన్‌ను తీసుకుంది.ఈ నెల 3వ తేదీ నుంచి 16వ ర‌కు నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో 1,12,122 శాంపిల్ల‌ను సేక‌రించారు. ఇందులో 85 శాతం అభిప్రాయాల‌ను నేరుగా ఓట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు.మ‌రో 15 శాతం అభిప్రాయాల‌ను ఆన్‌లైన్ ద్వారా సేక‌రించారు.

టౌమ్స్ నౌ తాజాగా చేప‌ట్టిన స‌ర్వే ప్ర‌కారం చూస్తే 19 లోక్‌సభ స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పింది. 47.6 శాతం ఓట్లతో ప్రభంజనాన్ని సృష్టిస్తుందని చెప్పింది. 2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన పట్టును నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తున్న‌ట్లు తేల్చేసింది.ఎన్‌డిఏ కూట‌మి చెప్పిన‌ట్లుగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అంటూ ఏదీ లేదని క్లారిటీ ఇచ్చేసింది ఈ స‌ర్వే. ఇప్ప‌టికి మూడుసార్లు టైమ్స్ నౌ స‌ర్వే నిర్వ‌హించ‌గా వైసీపీకి అనుకూలంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. అలాగే మ‌రో ప‌ది సంస్త‌లు ఇదివ‌ర‌కు వెల్ల‌డించిన స‌ర్వేల్లో కూడా వైసీపీకి అనుకూలంగా ఫ‌లితాలు రావ‌డం విశేషం. ఈ స‌ర్వే ఫ‌లితాలో ఎన్‌డిఏ కూట‌మికి దిక్కు తోచ‌డం లేదు. కాగా వైసీపీ శ్రేణులు మ‌రింత ఉ్స‌తాహంతో ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news