ఏపీ అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా సీఎం జగన్‌పై ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినే త చంద్రబాబు సభా హక్కుల ఉల్లంఘన నియమం కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నే హక్కు ల నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదొక సంచలన విషయం. అయితే, ఈ పరిణామం చంద్ర బాబుకు కలిసి వచ్చేనా? లేక మరోసారి ఆయనను వైసీపీ టార్గెట్ చేస్తుందా ? అనేది తేలాల్సి ఉంది. ఈ ఉ దంతానికి సంబంధించి ఒకసారి లోతుపాతులు పరిశీలిస్తే.. చాలా చిత్రమైన విషయాలు వెలుగు చూస్తాయి.
సభకు ప్రవేశించే గేటు వద్ద చీఫ్ మార్షల్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఈ మొత్తం వ్యవహారానికి కారణంగా కనిపిస్తున్నాయి. ప్లకార్డులు పట్టుకుని, చొక్కాలకు బ్లాక్ రిబ్బన్లు పెట్టుకుని ప్రవేశించేందుకు బాబు అండ్ బృందం ప్రయ త్నించడం, వారిని అడ్డుకునేందుకు మార్షల్స్ గేట్లు మూసివేయడం దీంతో బాబు బృందం ఆ గేట్లను తోసు కుంటూ ముందుకు రావడం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అన్ పార్లమెంటరీగా వ్యవహ రించారని వైసీపీ నేతల ఆరోపణ.
ముఖ్యంగా చీఫ్ మార్షల్‌ను పట్టుకుని బాస్టర్డ్ అన్నాడని వైసీపీ నేతల ప్రధాన విమ ర్శ. దీనిపైనే శుక్రవారం నాటి సభ భారీ ఎత్తున గందరగోళానికి దారితీసింది. అయితే, దీనిపై చంద్రబాబు ఎదురుదాడి చేశారు.
అసెంబ్లీ గేటు నుంచి లోపలకు రానివ్వకుండా చీఫ్ మార్షల్ నన్ను ఆపినప్పుడు.. నన్ను ఆపడానికి ఆయ నెవరు..? నో క్వశ్చన్ అని నేను అన్నాను. దానిని వక్రీకరించి బాస్టర్డ్ అన్నానని పచ్చి అబద్ధపు ఆరోపణ చేసి అసెంబ్లీలో నన్ను భయంకరంగా తిట్టారు.
ఈ వక్రీకరణకు ముఖ్యమంత్రి జగన్ తానే నాంది పలకడం మరీ ఘోరం- అంటూ చంద్రబాబు సభలోనే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. చంద్రబాబు స్పీకర్‌కు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. అయితే, దీనిపై సోమవారం మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కన్నా కూడా జగనే పైచేయి సాధించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.