రేవంత్ వాయిస్ పెంచింది అందుకేనా…అరెస్ట్ తప్పదా…!

-

ఢిల్లీ పోలీసులు ఇప్పుడు హైదరాబాద్లో మకాం వేశారు. సీఎం రేవంత్ లక్ష్యంగా వారు నిఘా పెట్టారని టాక్ వినిపిస్తోంది. జహీరాబాద్ సభలో ప్రధాని మోదీ… డీప్ ఫేక్ వీడియోలపై చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు సైలెంట్ గా ఆపరేషన్ చేస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. అసలు తెలంగాణలో ఎం జరువుతోందని నిఘా వర్గాలు సైతం దృష్టి సారించాయి. రిజర్వేషన్లపై రేవంత్ దూకుడుగా మాట్లాడుతున్నాది అందుకేనంటూ లింక్ కలిపేస్తున్నారు.రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌తో కలిపి ఏడుగురుకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఫేక్ వీడియోపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మే 1న విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం మే 29న మొదటిసారి సీఎం రేవంత్ సహా నలుగురు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకాకుండా న్యాయవాది ద్వారా సీఎం రేవంత్ రెడ్డి జవాబు పంపించారు. తాను ఉపయోగించే ట్విటర్ ఖాతాలో అమిత్ షా ఫేక్ వీడియో పోస్టు చేయడంగాని, రీట్వీట్ చేయడంగాని చేయలేదని తన సమాధానంలో స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే…రేవంత్ కూ అరెస్టు ముప్పు ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. తీవ్రమైన సెక్షన్ల కింద కేసు పెట్టడం.. టీ పీసీసీ చీఫ్ హోదాలో ఉండటంతో ఆయనను అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంటోంది. అందుకే రేవంత్ రెడ్డి మరింత ఉద్ధృతంగా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతున్నారని అంటున్నారు. తాను రిజర్వేషన్లను రద్దు చేయాలన్న బీజేపీ కుట్రను బయట పెట్టినందుకే తనను వేటాడుతున్నారని చెప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ సీనియర్ నేత నారాయణ కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news