ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. గుర్రున తిరుగుతున్న మీటర్లు.. 50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం

-

భానుడి భగభగలతు తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు వీర ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక ఇళ్లలోనూ ఉక్కపోత భరించలేకు 24 గంటలు కూలర్లు, ఏసీలు ఆన్ చేసే ఉంచుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఈ నెల 3న (శుక్రవారం) అత్యధికంగా 89.71 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదైందని ఫరూఖీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2న 228.50 మి.యూ. వినియోగం నమోదైందని, గతేడాది మే 2 (151.71 మి.యూ.)తో పోలిస్తే ఇది 50.62% అదనమని వెల్లడించారు. మున్ముందు హైదరాబాద్‌లో రోజువారీ వినియోగం 90 మిలియన్‌ యూనిట్లకు మించుతుందని పేర్కొన్నారు. ఈ నెల ముగిసేవరకు రాష్ట్రవ్యాప్తంగానూ డిమాండ్‌ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news