తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇవే

-

భారత్లో పసిడి, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు బంగారం కొనలేకపోతున్నారు. ఆదివారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.73,500 ఉండగా, సోమవారం నాటికి రూ.281 పెరిగి రూ.73,781కి పెరిగింది. ఆదివారం కిలో వెండి ధర రూ.82,364 ఉండగా, సోమవారం నాటికి రూ.852 పెరిగి రూ.83,216కు చేరింది.

హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.73,781, కిలో వెండి ధర రూ.83,216గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,781గా ఉంది. కిలో వెండి ధర రూ.83,216గా ఉంది. ఈ ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2302 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 10 డాలర్లు పెరిగి 2312 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 26.95 డాలర్లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news