ఎన్నికల్లో జగన్ ఓడిపోతున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అతడు మళ్లీ వస్తాడని జీరో పర్సెంట్ కూడా లేదని చంద్రబాబు అన్నారు.వైయస్ జగన్ మెడలు వంచడు కానీ.. మోదీ కాళ్లు పట్టుకుని తనపైన ఉన్న కేసులు మాఫీ చేసుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ నైజం అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్లుగా ఉంటుందని అన్నారు. ఇది రాజకీయాల్లో సరి కాదని చంద్రబాబు తెలిపారు.
జగన్‌ది నార్సిజమని చంద్రబాబు అభివర్ణించారు. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారన్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఎంతో మంది భయంకరంగా ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఎన్జీవోలకు ముఖ్యమంత్రులు సైతం భయపడిన సందర్భాలు రాష్ట్రంలో కోకోల్లలుగా ఉన్నాయన్నారు. చివరకు రాజశేఖర్ రెడ్డికి కూడా అలాంటి పరిస్థితే ఎదరైందని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ నేడు వైయస్ జగన హయాంలో ఎన్జీవోస్ సైతం నోరు విప్పలేని పరిస్థితి అని,మళ్లీ వైయస్ జగన్ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించేందుకు పీఆర్సీ వేస్తాడంటూ చంద్రబాబు ఎద్దేవ చేశారు.