ఈ విష‌యంలో కేటీఆర్ కొత్త కండీష‌న్స్.. టెన్ష‌న్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

-

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతో కలుపుకుంటే తెలంగాణలోని మొత్తం 120కి పైగా మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్నీ ఎక్కువ సీట్లు సాధించి… మరోసారి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు టీఆర్ఎస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. అయితే మునిసిపాలిటీలకు అభివృద్ధి నిధుల కోసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తున్న అనేక మంది ఎమ్మెల్యేలు… పనిలో పనిగా పార్టీ టికెట్ తమ వర్గానికి చెందిన వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. తమ వర్గానికి చెందిన నేతలకు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న ఎమ్మెల్యేలకు కేటీఆర్ కొత్త కండీషన్ పెడుతున్నట్టు తెలుస్తోంది.

నేతలకు టికెట్లు ఇప్పించుకోవడంతోనే బాధ్యత ముగిసిపోదని.. వారిని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని ఆయన వారికి స్పష్టం చేస్తున్నారు. అలా గెలిపించకపోతే.. ఆ తరువాత మిగతా నామినేటేడ్ పదవుల విషయంలో ప్రాధాన్యత ఉండబోదని వారికి కేటీఆర్ పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక కొన్ని చోట్ల టికెట్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని.. దానికి నేత‌లు ఖ‌చ్చితంగా ఒప్పుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కండీష‌న్స్ అన్నీ విన్న టీఆర్ఎస్ నేత‌ల‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news