కేసీఆర్‌కి అపాయింట్మెంట్ ఇవ్వొద్దని మోడీతో చెప్పా…బీజేపీ ఎంపీ!

-

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు కూడా నడవదని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులన్నీ పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి కాళ్లు మొక్కుతారు, ఇక్కడకు వచ్చి తిడతారని విమర్శించారు. కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వొద్దని ప్రధాని మోదీకి చెప్పానన్నారు.

 

కేసీఆర్‌ ఒంటెత్తు పోకడలతో రాష్ట్రం సర్వనాశనమవుతోందని ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఇటీవ‌ల ఎంపీ సోయం బాపూరావు అటవీ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పోడు భూముల్లోకి వచ్చే అటవీ అధికారులను తరిమికొట్టాలని ఆయన పిలుపునివ్వడం చర్చానీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news