పవన్ అంటే పవనం కాదు.. ఒక సునామీ : ప్రధాని మోడీ

-

ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ అంటే పవనం కాదు.. ఒక సునామీ అని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మన సమక్షంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆంధ్రా మాకు అతిపెద్ద బహుమతి ఇచ్చింది. చారిత్రక విజయం సాధించామని చంద్రబాబు నాతో చెప్పారు.

కర్ణాటక, తెలంగాణలో ఎంత తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అంతే తొందరగా ప్రజా విశ్వాసాలు కోల్పోయాయి. ఆ రెండు రాష్ట్రాలలో ఎన్డీఏను ఆదరించారు. అలాగే  ఏపీ కూడా మాకు అతిపెద్ద విజయాన్ని అందించింది. ఇవి మాకు భావోద్వేగ క్షణాలు. భారతదేశ స్ఫూర్తికి ఎన్డీఏ కూటమి ఒక ఉదాహరణ అన్నారు. ఎన్నికలకు ముందే కూటమి కట్టి గెలుపు సాధించడం ఒక చరిత్ర అన్నారు. మినిమం.. గవర్నమెంట్.. మాగ్జిమమ్ గవర్నెన్స్ అనే స్పూర్తితో ఎన్డీఏ పని చేస్తుందన్నారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆలోచిస్తున్నాను. ఆదివాసులు గణనీయంగా ఉన్న 10 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news